వక్కంతం సినిమాలో నితిన్ ఎలా కనిపించనున్నాడంటే?
మాచర్ల నియోజకవర్గం సినిమాతో దారుణమైన పరాజయాన్ని అందుకున్న నితిన్, ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. తన సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మొన్నీ మధ్య వరకు ఈ సినిమా గురించి అసలేం అప్డేట్స్ రానే లేదు. కానీ రీసెంట్గా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
నితిన్ ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నాడట. నితిన్ ను సినిమా పిచ్చోడిలా చూపిస్తూ వక్కంతం తన క్యారెక్టర్ ను డిసైడ్ చేశాడట. అంతేకాదు నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా మంచి ఎంటర్టైన్మెంట్ పండించనున్నాడని తెలుస్తోంది. వెండితెరపై కనిపించాలనే నితిన్ తాపత్రయం చూసి అందరూ నవ్వుకోవడం ఖాయమట.
కాకపోతే ఈ నేపథ్యం సినిమా మొత్తం ఉండదని తెలుస్తోంది. మిగిలినదంతా ఎంటర్టైన్మెంట్ తరహాలోనే సాగుతుందంటున్నారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ లో కనిపించే జూనియర్ ఆర్టిస్ట్ ల బాధను ఈ సినిమాలో ఫన్నీగా చూపించి ఎంటర్టైన్ చేయబోతున్నాడట వంశీ. అప్పుడెప్పుడో సినిమా నేపథ్యంలో పూరీ నేనింతే సినిమా తీశాడు. ఆ తర్వాత మళ్లీ ఈ నేపథ్యంలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. ఇప్పుడు మళ్లీ వక్కంతం వంశీ ఆ నేపథ్యాన్ని వాడుకోబోతున్నాడు. మరి ఈ సినిమాతో అయినా నితిన్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.













