మార్చి 29న వకీల్ సాబ్ ట్రైలర్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. దిల్ రాజు-శిరీష్ నిర్మించిన ఈ మూవీని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 29న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు మేకర్స్. దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. లాయర్ గెటప్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న వకీల్ సాబ్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా అంచనాలను మరింత పెంచేదిలా ఉంటుందని నమ్ముతున్నారు మేకర్స్.
ఇప్పటికే మొదలైన ప్రమోషన్స్ సినిమా బజ్ ను పెంచేశాయి.ట్రైలర్ కు కూడా డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేయబోతున్నారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర తారాగణంగా నటిస్తున్నారు. థమన్ సంగీతంలో ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, పవన్ తో పని చేయడం ఎన్నో ఏళ్ల కల అని థమన్ రీసెంట్ గా చెప్పుకొచ్చారు. మొన్నటి వరకు అసలు బజ్ లేదని నిరుత్సాహ పడిన ఫ్యాన్స్ కు వకీల్ సాబ్ టీమ్ రోజుకో వార్తతో ట్రీట్ ఇస్తుంది.













