వకీల్ సాబ్ టీమ్ స్టార్ట్ చేసేశారు..
వకీల్ సాబ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. హిందీలో సూపర్ హిట్ ఫిల్మ్ పింక్ కు ఇది రీమేక్. వేణు శ్రీరామ్ డైరక్షన్ లో బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ మరియు బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు, శిరీష్ లు వకీల్ సాబ్ ను నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్లలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న వకీల్ సాబ్ ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో చేపట్టేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
రిలీజ్ దగ్గర పడుతున్నా వకీల్ సాబ్ పబ్లిసిటీ మాత్రం మొదలు పెట్టలేదని ఫ్యాన్స్ నిరాశ పడుతున్న టైమ్ లో చిత్ర యూనిట్ ఎలక్ర్టానికి, ప్రింట్ మీడియాల ప్రమోషన్స్ మొదలెట్టేసింది. డైరక్టర్, మ్యూజిక్ డైరక్టర్, లిరిసిస్ట్ లతో ఇంటర్వూ చేయించి, ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది వకీల్ సాబ్ టీమ్. ఏప్రిల్ 3న యూసఫ్ గూడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారని, దాని కోసం సుమారు కోటి రూపాయల్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న పవన్ కంబ్యాక్ ఫిల్మ్ కావడంతో వకీల్ సాబ్ ప్రమోషన్స్ కోసం భారీ గా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది.













