‘వకీల్ సాబ్’ ప్యాకెడ్ బ్లాక్ బస్టర్ అంటున్నారే గాని… కలెక్షన్లు చెప్పడం లేదేంటబ్బా!
ఒకప్పుడు సినిమా హిట్ సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ సినిమా రన్ నుబట్టి ఏ రేంజ్ హిట్టో అంచనాకు వచ్చేవారు. 50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200రోజలు 250 రోజులు ఏడాది.. ఎలా సినిమా ఎన్ని ఎక్కువ రోజులు ఆడితే అంత ఘన విజయం సాధించినట్టు. కానీ ఈ మధ్య కాలంలో రోజుల స్థానం లో కలెక్షన్లు వచ్చి చేరాయి. అంటే ఎన్నిరోజులు ఆడిందన్నది మ్యాటర్ కాదు.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందన్నదే ముఖ్యం అందుకే ఈ మధ్య కాలంలో ఏ సినిమా వచ్చిన సాధించిన కలెక్షన్లతో పెద్ద పెద్ద పోస్టర్స్‌ని రిలీజ్ చేస్తున్నారు. చిన్న చిన్న సినిమాలు కూడా పెద్ద పెద్ద అంకెలతో కలెక్షన్ల పోస్టర్స్‌ని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ప్రమోషన్స్ నిర్వహించుకుంటున్నారు. అంతకు ముందు వరకూ కలెక్షన్ల లెక్కల్ని పెద్దగా పట్టించుకునే వారు కానీ.. సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురం రిలీజ్ అప్పుడు మాత్రం పెద్ద పెద్ద పోస్టర్స్‌లు వేసుకుని సంక్రాంతి కా బాప్ అని అదీ అదీ అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు అంకెలు వేసుకునేవారు. ఆ తరువాత ఈ ఫ్లో కంటిన్యూ అవుతూ వస్తోంది. అయితే వకీల్ సాబ్ విషయంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. అయితే ఈ కలెక్షన్లకు సంబంధించి నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన చేయకపోవడం. తన సన్నిహితుల్ని లెక్కలు లీక్ చేయొద్దని చెప్పడంతో అసలు వకీల్ సాబ్ ఎంత కలెక్ట్ చేసిందన్న విషయంపై క్లారిటీ రాలేదు. అయితే తొలి షోతో వకీల్ సాబ్ వేట మొదలుపెట్టగా… వరుసగా ఐదోరోజు సక్సెస్ ఫుల్ రన్ కొనసాగింది. ఇక ఉగాది, అంబేద్కర్ జయంతి వరుస సెలవు దినాలు రావడంతో కలెక్షన్లు పుంజుకున్నాయి. పెట్టిన పెట్టుబడిన తొలి రెండు రోజుల్లోనే వకీల్ సాబ్ రాబట్టిందని అంచనా ఈ బ్రేక్ ఈవెన్ సాధించి రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్టు ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. తన సినిమాలకి సంబంధించి ఎప్పటికప్పుడు లెక్కలు బయటకు విడుదల చేసి గొప్పగా చెప్పుకునే దిల్ రాజు, వకీల్ సాబ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు లెక్కలు లీక్ చేస్తే ఏమౌతుంది?? ఏరోజు ఎంత వచ్చిందనే విషయం బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వెనుక వ్యూహం ఏమైనా ఉందా? లేదంటే ప్రభుత్వాలను నుండి ఏదైనా ఇబ్బందులు వస్తయనా? ఐటీ దాడులు జరుగుతాయనా? కలెక్షన్ వెల్లడి చేయకపోవడంతో పవన్ ఫాన్స్ నిరుత్సహాంగా వున్నారు.













