ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కిస్తున్న సంచలన చిత్రం ‘వకీల్ సాబ్’
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వకీల్ సాబ్ మూవీ మరింత వేడెక్కిస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇంచార్జి సునీల్ దియోధర్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను చూస్తే వైఎస్ జగన్‌కు భయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీల్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసిన వీడియో ప్రకారం. బెయిల్ క్యాన్సిల్ అంటూ సంచలనం తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్‌ను టార్గెట్ చేస్తూ ఆయన బెయిల్ ఏ క్షణంలోనైనా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని కామెంట్ చేసి రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టించారు. ఏపీలో రౌడీ రాజ్యం ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టుకు ఇక వకీల్ సాబ్ సినిమా రిలీజ్ రోజున మరో సంచలన వీడియోను ట్విట్టర్లో రిలీజ్ చేశారు. ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరు వేయించుకొనే అలవాటు ఉన్నవాడే కదా వకీల్ సాబ్‌ను చూసి భయపడేది అంటూ సునీల్ దియోధర్ కామెంట్ చేశారు. దాంతోపాటు వీడియోను కూడా షేర్ చేశారు. వకీల్ సాబ్ సినిమా చూడటానికి వచ్చా.
సునీల్ దియేధర్ వీడియోలో పేర్కొన్న ప్రకారం.. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాను చూడటానికి వచ్చాను. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ తీరు చాలా బాధను కలిగించింది. పవన్ కల్యాణ్ అంటే ఆయనకు విపరీతమైన భయం ఉన్నట్టు స్పష్టమైంది అని సునీల్ కామెంట్ చేశారు. అవినీతి, మత మార్పిడులను ప్రశ్నిస్తాం. త్వరలోనే ఏపీలో మీ పాలనకు వ్యతిరేకంగా, అనాగరిక చర్యలకు వ్యతిరేకంగా, మీ రౌడీ పాలనకు, అవినీతి కుటుంబానికి వ్యతిరేకంగా, మత మార్పిడులకు వ్యతిరేకంగా, మాత మార్పిడులకు ఆర్థిక సహాయం చేయడంపై ప్రశ్నించే సమయం రానున్నది. ఇప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం సరైన సమయం కాదు అని సునీల్ దియేధర్ అన్నారు. అవినీతి, మత మార్పిడులను ప్రశ్నిస్తాం? త్వరలోనే ఏపీలో మీ పాలనకు వ్యతిరేకంగా, అనాగరిక చర్యలకు వ్యతిరేకంగా, మీ రౌడీ పాలనకు, అవినీతి కుటుంబానికి వ్యతిరేకంగా, మత మార్పిడులకు వ్యతిరేకంగా, మాత మార్పిడులకు ఆర్థిక సహాయం చేయడంపై ప్రశ్నించే సమయం రానున్నది. ఇప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం సరైన సమయం కాదు అని సునీల్ దియేధర్ అన్నారు.













