ఆదికేశవ పోస్ట్‌పోన్ అంతా మంచికే!
పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన సినిమా ఆదికేశవ. ముందు అనుకున్న ప్రకారమైతే ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ కావాల్సింది కానీ రిలీజ్ దగ్గర పడుతున్న టైమ్ లో సినిమాను వాయిదా వేసి, సినిమాను నవంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేశాడు.
అంతేకాదు, సినిమాను పోస్ట్ పోన్ చేయడానికి గల కారణాలను కూడా నాగవంశీ వివరించాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమా మన చేతిలో ఉన్నప్పుడు అనవసరంగా పోటీకి వెళ్లి సినిమాకు వచ్చే కలెక్షన్స్ ను షేర్ చేసుకోవడం కంటే డిస్ట్రిబ్యూటర్ల గురించి ఆలోచించి, సోలో రిలీజ్ కు వెళ్లడం బెటర్ అనుకునే ఈ డెసిషన్ తీసుకున్నట్లు నాగవంశీ తెలిపాడు.
ఒకవేళ ఆదికేశవ, ముందు అనుకున్నట్లు పదో తేదీకి వస్తే ఆ రోజు చాలానే రిలీజులున్నాయి. టైగర్3, జపాన్, జిగర్తండా డబుల్ ఎక్స్, ది మార్వెల్స్ అన్నీ అదేరోజున రిలీజ్ కానున్నాయి. పేరుకు డబ్బింగ్ సినిమాలే అయినా మన ఆడియన్స్ లో ఈ సినిమాలపై మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు రెండు సెమీ ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు, ఓ ఫైనల్ మ్యాచ్ కూడా ఉన్నాయి.
అలాంటప్పుడు అనవసరం రిస్క్ తీసుకోవడం ఎందుకని నాగవంశీ ఆలోచించి, ఆదికేశవను 24కు షిఫ్ట్ చేశాడు వంశీ. పైగా ఆ రోజుకు పెద్దగా రిలీజ్ లు కూడా లేవు. డెవిల్ సినిమా పోస్ట్ పోన్ అయింది. కోటబొమ్మాళి రేసులో ఉన్నప్పటికీ దాని గురించి పెద్దగా టెన్షన్ పడే అవసరం లేదు. మొత్తానికి ఆదికేశవ రిలీజ్ పోస్ట్ పోన్ చేసినా అది మంచి నిర్ణయమే అని అందరూ అభిప్రాయపడుతున్నారు.













