మరో బడా బ్యానర్లో బేబీ హీరోయిన్
బేబీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన వైష్ణవి చైతన్యకు మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి. బేబీ సక్సెస్ అవడంతో వైష్ణవికి స్టార్ ఇమేజ్ కూడా వచ్చేసింది. అంతే కాదు పెద్ద పెద్ద బ్యానర్ల నుంచి వైష్ణవికి ఆఫర్లు వస్తున్నాయి. కానీ తన తర్వాతి సినిమా ఏంటనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియడం లేదు.
ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ లో ఓ సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్న వైష్ణవి, దిల్ రాజు బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రానున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని టాక్. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ త్వరలోనే సినిమాను అనౌన్స్ చేయనున్నారని టాక్. అంతే కాదు ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటూ వైష్ణవికి మరో ఆఫర్ కూడా దక్కిందని టాక్.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తున్న ఓ సినిమా కోసం వైష్ణవిని తీసుకునే ఆలోచనగా ఆయన ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఒకేసారి మూడు బడా బ్యానర్స్ లో ఆఫర్లు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ వైష్ణవి ఆ రేర్ ఫీట్ ను సాధించింది. మరి వీటిలో ఏ సినిమా ముందు పట్టాలెక్కుతుందో చూడాలి.













