మరో బంపరాఫర్ కొట్టేసిన మెగా మేనల్లుడు
ఉప్పెన తో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేసే తెరంగేట్రం చేశాడు. డెబ్యూ హీరోల్లో చిన్న బడ్జెట్ సినిమాల్లో రీసెంట్ గా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఇదే. చరణ్ చిరుత, అఖిల్ అఖిల్.. ఆఖరికి హృతిక్ కహోనా ప్యార్ హై క్రియేట్ చేసిన రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది.
ఉప్పెన విజయం తర్వాత వైష్ణవ్ క్రేజ్ ఎలా అయితే పెరిగిందో, అంతే డిమాండ్ కూడా పెరిగింది. తను చేయబోయే రెండు సినిమాలకు వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఉప్పెన ను ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతోనే ఈ రెండు సినిమాలను వైష్ణవ్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ అగ్రిమెంట్ పై సైన్ చేసినందుకు వైష్ణవ్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నాడట.
ఇదిలా ఉంటే ఈ సినిమాలకు కూడా స్టార్ డైరక్టర్ సుకుమార్ కథలను ఫిక్స్ చేస్తాడట. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటుగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా కలిసి ఈ రెండు సినిమాలను నిర్మించనున్నారని, దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు మాత్రం ఎటువంటి అఫీషియల్ న్యూస్ లేదు. ఇకపోతే వైష్ణవ్ ఆల్రెడీ క్రిష్ డైరక్షన్ లో కొండపొలం ను ఫినిష్ చేశాడు. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మూడో సినిమా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో గిరీశయ్య డైరక్షన్ లో కేతికా శర్మ హీరోయిన్ గా తెరకెక్కనుంది.













