వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం
ఉప్పెన్ ఫేమ్ వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లోప్రారంభమైంది. అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్ తెరకెక్కించిన గిరీశాయ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్‌పై బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఉప్పెనతో యువతకు దగ్గరైన వైష్టవ్ తేజ్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసే కథతో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ను రూపొందిస్తున్నాం. దర్వకుడు సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరీరాయ ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు అన్నారు. కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ దత్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.













