వైష్ణవ్ ఇకనైనా జాగ్రత్త పడాల్సిందే!
ఉప్పెన లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ తో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ ఆ సినిమాతో ఎవరూ ఊహించని డెబ్యూ ఇచ్చడు. మొదటి సినిమాకే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావడమంటే మాటలు కాదు. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ సెటిల్ అయిపోతాడనుకున్నారంతా. కానీ వైష్ణవ్ నుంచి వచ్చిన తర్వాతి సినిమాలు బాగా నిరాశ పరిచాయి.
కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలతో ఫ్లాప్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ముచ్చటగా మూడో సారి కూడా ఆదికేశవ పేరిట ఫ్లాప్ ను మూట గట్టుకున్నాడు. సినిమాపై నమ్మకంతో ముందు రోజే ప్రీమియర్స్ వేసినప్పటికీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆదికేశవ ఆడియన్స్ ను ఏ మాత్రం మెప్పించలేకపోయింది.
అయితే ఆదికేశవ రిజల్ట్ తో ఓ విషయంలో క్లారిటీ వచ్చింది. వైష్ణవ్ కు ఇప్పటికీ ఇంకా సొంత ఫ్యాన్ బేస్ లేదు. పోనీ మెగా ఫ్యాన్స్ అందరూ వైష్ణవ్ ను సపోర్ట్ చేస్తున్నారా అంటే అదీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైష్ణవ్ అవేమీ ఆలోచించకుండా, తనకు ఏ మాత్రం సూట్ అవని మాస్ సినిమాలను సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేసుకుంటూ పోతే తన కెరీర్ ముందు ముందు ఇబ్బందుల్లో పడే అవకాశముందని వైష్ణవ్ ను హెచ్చరిస్తున్నారు.













