ఆదికేశవ ఆగస్టులో అయినా వస్తుందా?
మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ఆదికేశవ. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది. ఆగస్ట్ 18న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా, ఇప్పటి వరకు టీజర్ కూడా రిలీజ్ కాలేదు. ఈ సినిమాకు ఇప్పటివరకు కనీస బజ్ కూడా లేదు. దీంతో ఈ సినిమా గురించి ఇప్పుడు నెట్టింట ఓ వార్త వినిపిస్తోంది. ఆదికేశవ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ఆగస్ట్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతుంది.
టైమ్ చూసుకుని ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమాల మధ్య రిలీజ్ చేస్తే సెకండ్ ఆప్షన్ గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ ఆశ పడుతున్నారు. ఉప్పెన తర్వాత వైష్ణవ్ చేసిన సినిమాలేవీ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో వైష్ణవ్ తేజ్ తన ఆశలన్నీ ఆదికేశవ్ పైనే పెట్టుకున్నాడు













