వైష్ణవ తేజ్ – క్రిష్ మూవీ కి కావలిసిన బజ్ వస్తుందా?
చిరంజీవి చిన్న మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు, మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ పంజా ఉప్పెన సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి మంచి వసూళ్లను రాబడుతుంది. అయితే సినిమా సక్సెస్ లో సగం క్రెడిట్ విజయ్ సేతుపతి తీసుకెళ్తే, మిగతా సగం హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్ తీసుకెళ్లారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కానీ ఉప్పెన రిలీజ్ కు ముందే వైష్ణవ్ తేజ్ కు మాత్రం నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి. అందులో డైరక్టర్ క్రిష్ తో చేస్తున్న సినిమా ఒకటి. రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ టైమ్ లో మొదలైన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా 45 రోజుల్లోనే పూర్తి చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్న ఈ సినిమాకు కొండపొలం అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
అయితే ఇప్పుడు అందరి కన్ను ఈ సినిమా ఓపెనింగ్స్ మీదే ఉన్నాయి. ఉప్పెన కు ఏ డెబ్యూ హీరోకి రాని కలెక్షన్స్ వైష్ణవ్ చూశాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా కు ఓపెనింగ్స్ రావడం కష్ణమే. ఎందుకంటే ఉప్పెనకు హీరోయిన్, సాంగ్స్, పైగా లాక్ డౌన్ తర్వాత అందరూ ఎంతగానో వెయిట్ చేసిన ఒక ఫీల్ గుడ్ మూవీ అవడమే. ఈ సినిమా విషయానికొచ్చే సరికి భారమంతా ఒక్క వైష్ణవ్ తేజ్ మీదే పడినుంది. మరి ఈ తరుణంలో వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ఎలాంటి హైప్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.













