చిత్రీకరణ పూర్తి చేసుకున్న వధుకట్నం
శ్రీహర్ష, ప్రియ, రఘు, కవిత, ఆర్యన్, రేఖ, కుషాల్ అనోన్య, మణిచందన ప్రధాన పాత్రధారులుగా భార్గవ గొట్టిముక్కల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వధుకట్నం. ఇలా జరగొచ్చేమో అనేది ఉపశీర్షిక. సమాజంలో స్త్రీకి జరుగుతున్న అన్యాయానికి కారకులైన వారిని ప్రశ్నిస్తూ, పరిష్కారానికి ముందుకురండి అని మహిళా లోకానికి పిలుపునిచ్చే ఒక మహిళా నాయకురాలిగా ఉద్యమం ఇదిరా అనే పాటలో నటి మణిచందన నటించారు. ఈ పాటతో షూటింగ్ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ ఇప్పటికే డబ్బింగ్ పూర్తిచేశాం. రీ రికార్డింగ్ జరుగుతోంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్ లంక, ఛాయాగ్రహణం: యస్.డి.జాన్.













