జూన్ 19న స్ట్రాంగ్ కంటెంట్‌తో ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ఆడియెన్స్ ముందుకు వస్తోంది – వడ్డే నవీన్
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో..
*హీరో, నిర్మాత వడ్డే నవీన్ మాట్లాడుతూ* .. ‘మా నాన్న గారు చనిపోయిన తరువాత నేను నటిస్తున్న, నిర్మిస్తున్న మొదటి చిత్రమిది. నేను ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఫ్యామిలీతోనే ఉంటున్నాను. నేను ఎక్కువగా బయట కనిపించను. కానీ నా గురించి మీడియా, అభిమానులు మాత్రం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అందుకు థాంక్స్. బ్రేక్ తీసుకున్నాను, వచ్చింది. నా వద్దకు వచ్చిన కథలు నచ్చలేదు, నచ్చిన కథలు నా వద్దకు రాలేదు. ఎన్నో కథలు విన్నాను. త్రిమూర్తులు పాత్ర గురించి మాత్రమే కమల్ చెప్పాడు. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అనే టైటిల్ కూడా చెప్పాడు. అయితే కథ, స్క్రిప్ట్ మీద ఏడాది పాటు ఇద్దరం వర్క్ చేశాం. కథ మొత్తం రెడీ అయ్యాక షూటింగ్‌కి వెళ్లాం. హై క్వాలిటీ స్టాండర్డ్‌లో ఉంటుంది. కంటెంట్ కూడా కొత్తగా ఉంటుంది. అందరం కలిసి ఓ ఫ్యామిలీలా ఈ మూవీ కోసం పని చేశాం. రాశీ గారు అద్భుతమైన నటి. జూన్ 19న స్ట్రాంగ్ కంటెంట్‌తో ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ఆడియెన్స్ ముందుకు వస్తోంది. మా చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. గత పదేళ్లుగా నేను ఎక్కడా కనిపించకపోయినా, సినిమాలు చేయకపోయినా నన్ను గుర్తు పెట్టుకున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.
*హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ* .. ‘‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమాలో నాకు లక్ష్మీ అనే మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నేను పని చేసిన అన్ని ప్రొడక్షన్ హౌస్‌ల్లో కెల్లా ఇది బెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ. వడ్డే నవీన్ గారు ఎంతో మంచి వ్యక్తి. నిర్మాతగా, హీరోగా ఆయన ఎప్పుడూ హంబుల్‌గానే ఉంటారు. వడ్డే నవీన్ గారి కమ్ బ్యాక్ చాలా గట్టిగా ఉంటుంది. జూన్ 19న మా చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
*దర్శకుడు కమల్ తేజ నార్ల మాట్లాడుతూ* .. ‘‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీకి ముందు నుంచీ మీడియా అద్భుతమైన సపోర్ట్ చేస్తూనే ఉంది. ఏడాదిన్నర పాటుగా కథ, స్క్రిప్ట్ మీద పని చేశాం. ఇలా మా టీజర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. నా డెబ్యూ మూవీ ఇంత గొప్పగా ఉంటుందని అనుకోలేదు. పూరి గారి వద్ద పని చేసినప్పుడు ఇలాంటి ఓ మూమెంట్ కోసం చూశాను. వడ్డే నవీన్ గారి ఫ్యాన్స్ అందరూ కోరుకున్నట్టుగా ఆయన రీ ఎంట్రీ, కమ్ బ్యాక్ ఉంటుంది. వడ్డే నవీన్ గారి లాంటి ఓ మంచి వ్యక్తితో నేను మొదటి సినిమా చేయడం ఆనందంగా ఉంది. టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. జూన్ 19న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నటుడు వడ్లమాని శ్రీనివాస్ మాట్లాడుతూ* .. ‘వడ్డే నవీన్ గారు మంచి మనిషి. పదేళ్లు గ్యాప్ ఇచ్చినా కూడా ఒకప్పటిలానే ఆయన ఉన్నారు. ఆయనతో పని చేయడం వల్ల నేను ఎంతో నేర్చుకున్నాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన నవీన్ గారికి థాంక్స్. జూన్ 19న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నటుడు సాయి కిరణ్ మాట్లాడుతూ* .. ‘వడ్డే నవీన్ గారి కమ్ బ్యాక్ అయిన ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. వడ్డే నవీన్ గారి పాటల్ని, సినిమాల్ని ఇప్పుడు కూడా అందరూ చూస్తూ ఉంటారు. జూన్ 19న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నటుడు సాత్విక్ మాట్లాడుతూ* .. ‘‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. వడ్డే నవీన్ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మా టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. జూన్ 19న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
*ఫైట్ మాస్టర్ రామ్ సుంకర మాట్లాడుతూ* .. ‘‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. ఇంటర్వెల్ ఫైట్ అద్భుతంగా ఉంటుంది. భారీ బడ్జెట్ చిత్రాల్లో ఎలాంటి హెవీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయో ఇందులోనూ అలాంటి గొప్ప ఎలిమెంట్స్ ఉంటాయి. వడ్డే నవీన్ గారి చిత్రాలెన్నో నాకు ఇష్టం. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
*సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ* .. ‘‘మంచి కమర్షియల్ సినిమాకి మ్యూజిక్ చేయాలని అనుకుంటున్న టైంలో ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అవకాశం వచ్చింది. ఆర్ఆర్ అద్భుతంగా వచ్చింది. ఈ మూవీ వండర్స్ చేస్తుంది. జూన్ 19న సినిమా రాబోతోంది. ఈ లోపు పాటలు వస్తాయి. అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
*ఎడిటర్ విజయ్ ముక్తవరపు మాట్లాడుతూ* .. ‘నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్న దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రం జూన్ 19న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
*కెమెరామెన్ కార్తీక్ సుజాత సాయికుమార్ మాట్లాడుతూ* .. ‘వడ్డే నవీన్ సర్కి ఇది కమ్ బ్యాక్. మేం పది నెలలుగా కష్టపడి ఈ మూవీని తీశాం. దీన్ని జనాల వరకు మీడియానే తీసుకు వెళ్లాలి’ అని అన్నారు.
*ఆర్ట్ డైరెక్టర్ భిక్షపతి మాట్లాడుతూ* .. ‘‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా సినిమా జూన్ 19న రాబోతోంది. అందరూ ఆశీర్వదించండి’ అని అన్నారు.
*కె మ్యూజిక్ ప్రియాంక మాట్లాడుతూ* .. ‘‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రయాణంతో నేను నవీన్ గారికి ఫ్యాన్‌గా మారిపోయాను. ఇలాంటి ఓ మంచి సినిమాతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. కళ్యాణ్ సంగీతం, వడ్డే నవీన్ గారి పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. జూన్ 19న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.







