వదలడు టీజర్ విడుదల
సిద్ధార్థ్ కథానాయకుడిగా నటించిన చిత్రం వదలడు. కేథరిన్ నాయిక. సాయిశేఖర్ దర్శకుడు. టి.నరేష్కుమార్, శ్రీధర్ నిర్మాతలు. టి.అంజయ్య సమర్పిస్తున్నారు. చిత్రం వచ్చే నెల 11న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేశారు. ఏలూరు సురేందర్ రెడ్డి, నట్టికుమార్ ముఖ్య అతిథులుగా హాజరై టీజర్‌ని విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ వదలడు.. దెయ్యం అయినా సరే అనే పేరుతో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ సినిమా కాన్సెప్ట్, హారర్ నేపథ్యం ఆకట్టుకునేలా ఉంటాయి అన్నారు. అంజయ్య మాట్లాడుతూ ప్రేమ అంత ఈజీ కాదు, కిల్లర్, కె.కె తో మా సంస్థ పారిజాత క్రియేషన్స్‌కి గుర్తింపు వచ్చింది. వదలడు ప్రేక్షకాదరణ పొందుతుంది అన్నారు.













