దుల్కర్ సల్మాన్ తో సార్ డైరెక్టర్
దుల్కర్ సల్మాన్‌ను పర భాషా నటుడిగా తెలుగు వాళ్లు ఎవ్వరూ ఫీలవ్వట్లేదు ఇప్పుడు. మణిరత్నం అనువాద చిత్రం ‘ఓకే బంగారం’తోనే అతను మన ప్రేక్షకుల మనసు దోచాడు. ఆ తర్వాత ‘మహానటి’ చిత్రంలో జెమిని గణేషన్ పాత్రతో మరింతగా మెప్పించాడు. ఇక ‘సీతారామం’ సినిమాలో రామ్ పాత్రలో అతడి అభినయం గురించి ఏం చెప్పాలి? మన హీరోలు కూడా ఎవరూ ఆ పాత్రకు సూట్ కారు, తనే పర్ఫెక్ట్ అని తెలుగు ప్రేక్షకులతో అనిపించే స్థాయిలో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చాడు.
దుల్కర్ సల్మాన్. టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని హీరో. పేరుకే పరభాషా నటుడు తప్పించి, తెలుగు ప్రేక్షకులెవరూ ఆయన్ని పరాయి హీరోగా ఫీలవరు. ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న దుల్కర్, ఆ తర్వాత మహానటిలో జెమినీ గణేషన్‌గా ఆకట్టుకున్నాడు. రీసెంట్గా సీతారామం సినిమాతో రామ్‌గా అందరినీ తన నటనతో మెస్మరైజ్ చేశాడు.
టాలీవుడ్ హీరోలెవ్వరూ ఆ క్యారెక్టర్ చేయలేరనే రేంజ్లో గొప్ప పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు దుల్కర్. యాక్టింగ్ తో పాటూ తెలుగు మాట్లాడటంలోనూ దుల్కర్ మంచి మార్కులే కొట్టేశాడు. అసలు నెగిటివిటీ అన్నదే లేకుండా ఎవరైనా సరే తనకు ఫ్యాన్ అవ్వాల్సిందే అనే రేంజ్లో దుల్కర్ పెర్ఫార్మ్ చేశాడు. సీతారామం తర్వాత మరింతమంది తెలుగు డైరెక్టర్లు దుల్కర్ తో సినిమాలు చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే వెంకీ అట్లూరి సినిమాకు దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రీసెంట్గా ధనుష్ తో సార్ సినిమా చేసిన వెంకీ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేయనున్న ఈ సినిమా పక్కా లవ్ స్టోరీగా తెరకెక్కబోతుందట. త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.













