రీలు సీఎమ్.. రియల్ సీమ్ కలుసుకున్నారు
భరత్ అనే నేను అంటూ వెండితెరపై ముఖ్యమంత్రిగా సందడి చేశాడు మహేశ్‌బాబు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత బాగుణ్ణు అని ఆయన అభిమానులు ముచ్చటపడ్డారు. ఈ రీలు సీమ్ని, రియల్ సీఎమ్ కలుసుకున్నారు. కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఆయనెవరో కాదు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేదీ సింగ్ రావత్. మహేశ్‌బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. డెహ్రాడూన్‌లో చిత్రీకరణ మొదలైంది. కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా త్రివేదీ సింగ్ సెట్లో అడుగుపెట్టారు. మహేష్, ఇతర చిత్రబృందంతో కాసేపు ముచ్చటించారు. దిల్‌రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే కథానాయికగా నటిస్తోంది. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.













