Ram: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం తొలిసారిగా లిరిసిస్ట్ గా మారిన రామ్ పోతినేని

ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Potineni) యూనిక్ ఎంటర్‌టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra King Taluka) తో అలరించబోతున్నారు. ఇందులో రామ్ సినిమా అంటే పిచ్చి ఇష్టం వున్న కుర్రాడిగా కనిపించబోతున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం హైదరాబాద్‌లో చివరి షూటింగ్ షెడ్యూల్‌లో ఉంది. టాలెంటెడ్ మ్యూజిక్ డ్యూయో వివేక్–మెర్విన్ “ఆంధ్రా కింగ్ తాలూకా” కోసం అదిరిపోయే ఆల్బమ్ కంపోజ్ చేశారు. ఈ ఆల్బమ్ నుంచి ఫస్ట్ సింగిల్ జూలై 18న రిలీజ్ కానుంది.
ఈ మెలోడియస్ ట్రాక్‌ని రాక్‌స్టార్ అనిరుధ్ రావిచందర్ పాడడం విశేషం. అనిరుధ్ పాడిన చాలా పాటలు చార్ట్‌బస్టర్స్ హిట్ కావడంతో ఈ పాటపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇంకొక స్పెషల్ సర్‌ప్రైజ్ ఏంటంటే.. ఈ పాటకి లిరిక్స్ రామ్ పోతినేని రాశారు. లిరిసిస్ట్‌గా ఇది అతని తొలి సాంగ్. మంచి ఎమోషనల్ లిరిక్స్, అనిరుధ్ వాయిస్, బ్యూటీఫుల్ లొకేషన్స్.. అన్నీ కలసి ఈ పాట అందరినీ అద్భుతంగా అలరించబోతోంది.
ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మ్యూజిక్ ప్రమోషన్స్ జోరు అందుకున్నాయి, పోస్ట్-ప్రొడక్షన్ కూడా చివరిదశలో ఉంది. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా పట్ల ఉన్న ప్రేమ, స్టొరీ టెల్లింగ్ ని సెలబ్రేట్ చేసే ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్‌గా అలరించబోతోంది.