ఉస్తాద్ రీమేక్ కాదు.. ఒరిజినలే..
రీమేక్ సినిమాలు అంటే చాలా వరకు ఒరిజినల్‌నే ఫాలో అయిపోతుంటారు డైరెక్టర్లు. ఓ భాషలో సినిమా హిట్టైదంటే, రీమేక్ చేసేటప్పుడు సీన్ టు సీన్ దింపేయాలనుకుంటారు. కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రం ఇందుకు భిన్నం. ఒరిజినల్లోని స్టోరీ లైన్‌ను తీసుకుని తనదైన శైలిలో కథనం జోడిస్తుంటాడు. సన్నివేశాలు చాలా వరకు మార్చేస్తుంటాడు.
దబాంగ్ సినిమా ఆధారంగా తీసిన గబ్బర్ సింగ్‌లో తన టాలెంట్ ఏంటో అందరూ చూశారు. ఒరిజినల్ చూసి, దీన్ని చూస్తే చాలా మార్పు కనిపిస్తుంది. సినిమా ఫ్లేవరే మార్చేశాడు హరీష్. దీని తర్వాత జిగర్తండకు ఇచ్చిన తెలుగు టచ్ కూడా స్పెషల్. పూర్తిగా నెరేషన్నే మార్చేస్తూ గద్దలకొండ గణేష్ కు ఒక కొత్త లుక్‌లో చూపించాడు హరీష్.
దీంతో రీమేక్ తీయాలంటే హరీషే తీయాలి అనే అభిప్రాయం టాలీవుడ్లో బలపడింది. అసలు ఇప్పుడు హరీష్ శంకర్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రీమేకా కాదా అనే అనుమానాలొస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా తేరి కు రీమేక్. కాకపోతే హరీష్ మాత్రం అందులో మూలకథను, హీరో క్యారెక్టర్ ను మాత్రమే తీసుకుని దానికి హరీష్ తనదైన టచ్ ఇస్తున్నాడు.
తేరి చూసినవాళ్లు, తాజాగా రిలీజైనుస్తాద్ భగత్ సింగ్ టీజర్ చూస్తే హీరో పోలీస్ అనే విషయంలో తప్ప ఎక్కడా ఏ పోలికా కనిపించలేదు. పవన్ క్యారెక్టర్ అంతా మారిపోయింది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఒరిజినల్‌తో పోలిస్తే ఈ కథను 90% మార్చారట. ఇందులో ఫ్లాష్ బ్యాక్ పూర్తి భిన్నంగా ఉండనుందట. చివరగా చూస్తే ఇది రీమేక్ అనే భావన ఎక్కడా రాదని చెప్తున్నారు.













