అమెరికా కవ్వింపు చర్యలు …
భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రికత్తలు నెలకొన్న నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో అమెరికా రెండు భారీ యుద్ధ నౌకలను (యుఎస్ఎస్ రోనాల్డ్ రీగన్, యుఎస్ఎస్ నిమిద్లను) మోహరించింది. గత వారం ఇలాంటి నౌకలనే మూడింటిని దక్షిణ చైనా సముద్రం వైపు తరలించిన అమెరికా శనివారం నాడు తన మిత్ర పక్షాలతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించింది. ద చైనా సముద్రంలో ఏ ప్రాంతంలో దీనిని నిర్వహించిందీ అమెరికా తెలపలేదు. మరో వైపు అమెరికా విన్యాసాలకు ప్రతిగా చైనా మిలటరీ డ్రిల్లు నిర్వహించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుస్ధిరత, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని మా మిత్రులకు, భాగస్వాములకు చెప్పేందుకే ఈ యుద్ధ నౌకలను మోహరించామని యుఎస్ఎస్ రోనాల్డ్ రీగన్ నౌక దళ కమాండ్ రియలర్ అడ్మిరల్ జార్జి ఎం వికాఫ్ అన్నారు. చైనాకు వ్యతిరేకంగా బ్రూనై, ఇండొనేషియా, మలేసియా, ఫిలిఫైన్స్ వంటి దేశాలను ఎగదోసేందుకు అమెరికా చేసిన యత్నాలు ఫలించకపోవడంతో ట్రంప్ ప్రభుత్వం ఈ సైనిక విన్యాసాలను చేపట్టింది. అమెరికా చర్య ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతుందని చైనా వ్యాఖ్యానించింది.













