టాలీవుడ్ నిర్మాతలకి షాక్ ఇచ్చేలా ఊర్వశి రౌతేలా రెమ్యునరేషన్
సినీ రంగం లో తొలి నాళ్ళ నుండి దక్షిణ భారత సినిమా లో చేసిన హీరోయిన్స్ కి బాలీవుడ్ లో ఎంటర్ అవడానికి ఒక వారధిగా ఉపయోగపడుతూ వస్తుంది. వహీదా రెహమాన్, హేమ మాలిని, రేఖ, జయప్రద, శ్రీ దేవి ఇలా ఎంతో మంది నటీమణులు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా వున్న విషయం తెలిసిందే. అనాదిగా వస్తున్న ఈ సెంటిమెంట్ తో మంచి ఆఫర్స్ వస్తే నటించాలని ముంబై బామలు ఈ మధ్య టాలీవుడ్ పై కాస్త స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. కానీ ఇపుడు మాత్రం రెమ్యునరేషన్ స్ట్రాంగ్ గా ఇస్తే ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధం అంటున్నారు. ఇకపోతే ఇటీవల ఒక బ్యూటీ కోసం టార్గెట్ చేసిన మన హీరోలు దెబ్బకు భయపడి దండం పెట్టేశారట. ఎందుకంటే ఆమె అడిగిన రెమ్యునరేషన్ వారికి దిమ్మతిరిగేలా చేసిందట.
తాజాగా భరత్ అనే నేను లో మహేష్ సరసన, వినయ విధేయ రామ లో రాంచరణ్ తో నటించిన కీయరా అద్వానీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకోవడమే కాకుండా వెంటనే బాలీవుడ్ సైడ్ కూడా ఎప్పటిలానే అదే రేంజ్ లో ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం అదే విషయాన్ని గమనించిన నార్త్ బ్యూటీలు ఈ మధ్య తెలుగు నుంచి ఎలాంటి ఆఫర్స్ వచ్చినా నో చెప్పకుండా కథకు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ మధ్య హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా అదే తరహాలో గోపిచంద్, అల్లు అర్జున్ ప్రాజెక్ట్ లకు సంబంధించిన ఆఫర్స్ అందుకుందట. ఎప్పుడైనా సరే రెమ్యునరేషన్ విషయంలో చర్చలు జరగడం కామన్. అడిగినంత ఇవ్వడానికి కొంతమంది నిర్మాతలు రెడీగా ఉండరు. ఇక ఊర్వశి కూడా ఇటీవల మనీ సబ్జెక్టు గురించి తరువాత మాట్లాడుకుందామని ముందయితే సినిమా సబ్జెక్టు చెప్పండి అంటూ ఎగబడిందట. తీరా అల్లు అర్జున్ సినిమా లో స్పెషల్ సాంగ్ కావడం, గోపి చాంద్ చిత్రం లో ఓ చిన్న రోల్ కావడంతో మనీ సబ్జెక్టు ముఖ్యమని తేల్చి చెప్పేసిందట.
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పుష్పలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఈ బ్యూటీని సంప్రదించారట. ఇక గోపిచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సీటిమార్ సినిమాలో అయితే కథను మలువు తిప్పే రోల్ కోసం అడిగారట. గత వారం రోజుల నుంచి ఈ రేండు ప్రాజెక్టుల గురించి చర్చలు జరిపిన ఊర్వశి ఇద్దరికి ఒకే రేటుతో షాకిచ్చిందట. అసలే ప్రొడ్యూసర్స్ గిల్డ్ 25శాతం పారితోషకం తగ్గించాలని తీర్మానం చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె రేంజ్ గట్టిగానే ఉన్నప్పటికీ నోటికొచ్చిన ఫిగర్ టాలీవుడ్ సినిమాలకు కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ అడిగిందట. కోటికి పైగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఎదో అరకోటి వరకు మ్యానేజ్ చేద్దామని అనుకున్న ఇద్దరు హీరోల నిర్మాతలకు ఈ హాట్ గల్ మళ్ళీ మాట్లాడలేని విధంగా డబుల్ రేట్ చెప్పడంతో దండం పెట్టేసి నో అని చెప్పారట. ఆ విదంగా ఊర్వశి టాలీవుడ్ లో వున్నా సెంటిమెంట్ ని వదిలేసుకున్నట్లే.













