ఇన్ని రోజులు ఆగి కూడా ఆ చిత్రాన్ని OTT లోనే రిలీజ్ చేస్తారంటా!
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సినీ అరంగ్రేటం చేసిన చిత్రం ‘రేయ్’ భారీ బడ్జెట్ తో దర్శక నిర్మాత ఆ చిత్రాన్ని నిర్మించారు అయితే సినిమా ప్రారంభమైన నాటినుండి ఎన్నో ఓడు దుడుకులను అధిగమించి సాయి ధరమ్ తేజ్ రెండవ చిత్రం గా విడుదల అయ్యింది. సాయి మొదటి చిత్రంగా పిల్లా నీవు లేని జీవితం విడుదల అయ్యింది. ఈ సెంటిమెంట్ సాయి కి కలిసి వచ్చింది అనుకుంటా~! అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ చిత్రం మొదటి చిత్రం ఉప్పెన. ఎంతో అట్టహాసం గా ప్రారంభమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన కి బ్యాడ్ లక్ అని చెప్పాలి.. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు.
చిరంజీవి వచ్చి స్వయంగా వైష్ణవ్ ని ఆశీర్వదించినా బాడ్ లక్ వెంటపడింది అని చెప్పొచ్చు.. వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా కావడం… ఈ చిత్రం లో నీ కన్ను నీలి ఆకాశం వీడియో సాంగ్ యూట్యూబ్ లో 152 మిలియన్ల వ్యూస్ తో సంచలం సృటించడం, సినిమా పై మంచి అంచనాలు కూడా ఉండడంతో ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు.. ఆ మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని వెయిట్ చేశారు. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కావడంతో అందరు నిర్మాతలు తమ సినిమాలను పూర్తి చేసే పనుల్లో నిమగ్నమైపోయారు.. కాగా ఉప్పెన సినిమా కూడా ధియేటర్ల లోనే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండడం విశేషం.
అయితే ఈ సినిమా ధియేటర్లలోనే రిలీజ్ అవుతుండడంతో వైష్ణవ్ నటిస్తున్న రెండో సినిమా OTT కా అన్న చర్చ మొదలైంది. వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా ను మాత్రం ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నారని విశ్వసనీయ సమాచారం అందుతోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు కొండపొలం అనే టైటిల్ అనుకుంటున్నారట. రకుల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఉప్పెన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అతి తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాత క్రిష్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తుండగా పవన్ రాకకోసమై వేచి చూస్తునాడు. ఆ రకంగా ఇద్దరి సినిమాలకు విడుదలలు ఆలస్యంగా జరగడం విశేషం.













