UI: అర్థం కాని సినిమాకు క్యూ కడుతున్న ఆడియన్స్
తాజాగా రిలీజైన ఉపేంద్ర(Upendra) యుఐ(UI) సినిమా చిత్రమైన టాక్ తెచ్చుకుంది. నెట్టింట ఇంటెలిజెన్స్ మేకింగ్ అనే కామెంట్స్ వినిపించినప్పటికీ, క్రిటిక్స్ మాత్రం ఇదేం సినిమా అంటూ పెదవి విరుస్తున్నారు. నార్మల్ ఆడియన్స్ లో కొందరు మధ్యలో లేచొస్తుంటే మరికొందరు మాత్రం క్లైమాక్స్ వరకు చూసి వావ్ అంటున్నారు.
చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఉపేంద్ర చెప్పినట్టు డీ కోడ్ చేసుకుంటే తప్ప కంటెంట్ అర్థం కాదన్న మాటే ఇప్పుడు నిజమైనట్టు కనిపిస్తుంది. ఈ టాక్ తో కూడా యుఐ కోసం ఆడియన్స్ థియేటర్లకు బాగానే వెళ్తున్నారు. ఈవెనింగ్ షోలకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవడంతో తెలుగు వెర్షన్ కు డీసెంట్ పికప్ దక్కి అందరికీ షాకిస్తోంది.
అలా అని టాక్ ఏమైనా పాజిటివ్ గా మారుతుందా అంటే అదీ లేదు. ఈ విషయాన్ని గుర్తించిన ఉపేంద్ర వెంటనే రంగంలోకి దిగి ఆంధ్రతో మొదలుపెట్టి సక్సెస్ టూర్ల వంటి వాటితో పబ్లిసిటీ పెంచాలని డిసైడయ్యాడట. ఇదే సినిమా వేరే హీరో లేదా డైరెక్టర్ తీసి ఉంటే రెండో రోజే థియేటర్ల నుంచి తీసేసేవారు. ఇక్కడ ఉపేంద్ర అనే బ్రాండ్ ఒక్కటే పని చేస్తోంది. ఆయన కోసమే యుఐను చూడాలని ఆడియన్స్ థియేటర్లకు వెళ్తున్నారు. మరి ఈ సినిమా ఫైనల్ రన్ ఏ మాత్రం ఉంటుందో చూడాలి.













