కన్నడ సినిమాలో చందమామ
అందాల చందమామ కాజల్ అగర్వాల్ టాలీవుడ్, కోలీవుడ్‌లో అగ్ర హీరోలందరి సరసన నటించేసింది. ప్రస్తుతం విశ్వ నటుడు కమల్ హాసన్ సరసన ఇండియా 2 లో నటిస్తోంది ఈ భామ. అయిత సౌత్‌లో కన్నడ, మలయాళ రంగాలతో కాజల్ కి అస్సలు టచ్ లేదు. అందుకే ఇకపై ఈ రెండు భాషల్లోనూ నటించాలని నిర్ణయించుకుందట. ఈ ప్రయత్నంలో భాగంగానే తొలిగా కన్నడ భాషపై దృష్టి సారించిందని తెలిసింది. కన్నడ, తెలుగు రంగాల్లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న ఉపేంద్ర సరసన ఓ ఛాన్స్ అందుకుంది కాజల్. కబ్జా అనేది టైటిల్. ఇది కూడా ఉపేంద్ర శైలిలో రా అండ్ రస్టిక్ కంటెంట్ ఉన్న సినిమా. ఇక కాజల్ ఇప్పటికే కెరీర్లో 50 చిత్రాలు పూర్తి చేసింది. హీరోయిన్గా సెంచరీ కొడతానన్న ధీమాని వ్యక్తం చేస్తోంది ఈ బ్యూటీ.













