Andhra King Thaluka: ఉపేంద్ర పాత్రపై ఇంట్రెస్టింగ్ న్యూస్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని(ram Pothineni) గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. స్కంధ(skandha), డబుల్ ఇస్మార్ట్(double ismart) సినిమాలతో డిజాస్టర్లు అందుకున్న రామ్ కు ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్టు అవసరం. అందుకే ఎలాగైనా తన తర్వాతి సినిమాతో హిట్ కొట్టాలని ఎంతో కసితో ఉన్నడు రామ్(ram). అందులో భాగంగానే మహేష్ బాబు.పి(mahesh babu.p) చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమాను చేస్తున్నాడు.
మహేష్ బాబు అంటే మరెవరో కాదు, రెండేళ్ల కిందట మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr polishetty) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ అందుకున్న సినిమా డైరెక్టర్. ఆ సినిమా తర్వాత మహేష్ నుంచి వస్తున్న సినిమా ఇదే. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మిస్తోన్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే(bhagya sri borse) హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా(andhra king thaluka) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.
ఈ మూవీలో ఉపేంద్ర(upendra) స్టార్ హీరో పాత్రలో కనిపించనుండగా, ఆయనకు వీరాభిమానిగా రామ్ కనిపించనున్నాడు. అయితే సినిమాలో ఉపేంద్ర పాత్రపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. మహేష్ బాబుపై డైరెక్టర్ సాలిడ్ ఎమోషనల్ సీన్ ను రాసుకున్నాడని, స్టార్‌డమ్ కోల్పోయిన టైమ్ లో ఆ హీరోకు వచ్చే అవకాశాలకు సంబంధించి తీసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని అంటున్నారు. థియేటర్లలో ఈ సీన్స్ బాగా పేలతాయని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. మరి ఈ సినిమా అయినా రామ్ కు తాను కోరుకున్న విజయాన్ని తెచ్చి పెడుతుందేమో చూడాలి.