నాగార్జున బదులు ఉపేంద్ర?
సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏ సినిమా తెరకెక్కినా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతుంది. డైరెక్టర్లంతా యూనివర్సల్ స్టోరీలతో సినిమాలు చేస్తుండటం వల్ల ఇతర భాషల్లో స్టార్స్ గా ఉన్న వారిని కూడా తమ సినిమాల్లో కీలక పాత్రల కోసం ఎంపిక చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపొస్తుందనే నేపథ్యంలో సదరు స్టార్లు కూడా ఆ సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు.
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పటికే రణ్బీర్ కపూర్ తో బ్రహ్మాస్త్ర చేశాడు. ప్రస్తుతం ధనుష్ తో కలిసి కుబేర చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న కూలి సినిమాలో కూడా నాగార్జున ఓ కీలకపాత్ర చేయనున్నాడని వార్తలొచ్చాయి. కానీ ఏమైందో ఏమో తెలీదు కానీ ఇప్పుడా పాత్ర కోసం డైరెక్టర్ లోకేష్, కన్నడ స్టార్ ఉపేంద్రను సెలెక్ట్ చేశారట.
ఓ వైపు కన్నడంలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు ఉపేంద్ర. కూలి సినిమాలో ఉపేంద్ర విలన్ గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఉపేంద్ర పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని, ఇప్పటికే ఉపేంద్ర కూలి షూటింగ్ లో జాయిన్ అయ్యాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఉపేంద్ర తో పాటూ అమితాబ్, రానా, శృతి హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.













