యుఎస్‌లో ‘ఐలవ్‌యు’ రిలీజ్‌కు సన్నాహాలు
టాలీవుడ్లో మంచి మార్కెట్ సంపాదించుకున్నారు ఉపేంద్ర. అల్లు అర్జున్ హీరోగా 2016లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర ఓ కీలకపాత్రలో నటించారు. అయితే ఇటీవల ఆయన ఐలవ్‌యు అనే రొమాటింక్తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. దర్శకుడు ఆర్ చంద్రు తెరకెక్కించిన ఈ చిత్రంలో రచితా రామచంద్రన్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ చిత్రాన్ని అమెరికా విడుదల చేయటానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని నటుడు ఉపేంద్ర తెలియజేశారు. ఇండియాలో తెలుగు, కన్నడ, భాషల్లో విడుదలైన ఈ చిత్రాన్ని యుఎస్‌లో విడుదల చేయలేదు. ఇపుడు తెలుగు, కన్నడ భాషల్లో అక్కడ ఈ నెల 19న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.













