చరణ్ రానందునే నేనొచ్చా
తప్పని సరిగా ఒక కార్యక్రమాల్లో రామ్చరణ్ పాల్గొనాల్సి రావడంతోనే గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సదస్సుకు హాజరు కాలేదని ఆయన సతీమణి ఉపాసన తెలిపారు. ఈ సదస్సుకు టాలీవుడ్ నుంచి పలువురికి మాత్రమే ఆహ్వానం అందింది. అయితే ఈ సదస్సు రామ్చరణ్ పాల్గొనాల్సి ఉందని, కానీ ఆయన హాజరు కాలేదు. దీనిపై పలు ఆరోపణలు వస్తుండంతో ఆయన సతీమణి స్పందించారు. ఇతర కార్యక్రమాలలో తప్పని సరిగా ఆయన పాల్గొనాల్సి రావడం కారణంగా చెర్రి ఈ సదస్సుకు రాలేకపోయారన్నారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ హోదాలో మొదటి రోజు ఆమె సదస్సుకు హాజరయ్యారు.













