పిల్లల విషయంలో పెళ్లి టైమ్‌లోనే డెసిషన్
ఎప్పుడో పదేళ్ల ముందు పెళ్లి చేసుకున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంట, ఎంతకీ తల్లిదండ్రులు కాకపోవడంతో వీరిపై నెట్టింట చాలా చర్చలు జరిగాయి. ఎక్కడ పడితే అక్కడ దీని గురించే డిస్కషన్స్. ఈ విషయంలో ఉపాసన, చరణ్‌ను ట్రోల్ చేసిన వాళ్లు, ఏదో ప్రాబ్లమ్ వల్లే వీళ్లకు పిల్లలు పుట్టట్లేదని కూడా అన్నవాళ్లున్నారు.
వీళ్లందరి రూమర్లకు, ఊహలకు చెక్ పెడుతూ, గతేడాది చరణ్, ఉపాసన పేరెంట్స్ కాబోతున్న విషయాన్ని వెల్లడించారు. దీంతో అందరి నోళ్లు మూతపడ్డాయి. అయితే అసలు పెళ్లి అయ్యాక పదేళ్ల తర్వాతే పిల్లల్ని కనాలని చరణ్, ఉపాసన ఇద్దరూ పెళ్లి టైమ్ లోనే అనుకున్నారట. బయట వ్యక్తులతో పాటూ, ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి కూడా తట్టుకుని తాము పదేళ్ల పాటూ పిల్లల్ని కనకుండా ఉన్నట్లు ఉపాసన వెల్లడించింది.
అందరూ కోరుకున్నప్పుడు కాకుండా తాను తల్లిని కావాలనుకున్నప్పుడు గర్భం దాల్చడం పట్ల తనకెంతో గర్వంగా ఉందని, పెళ్లైన పదేళ్ల తర్వాతే తాము పిల్లల్ని కనాలనుకున్నట్లు చెప్పుకొచ్చింది ఉపాసన. పిల్లల్ని కనడానికి ఇదే సరైన సమయమని, తామిద్దరూ వాళ్ల రంగాల్లో ఎదిగినట్లు, ఆర్థికంగా బలోపేతమైనట్లు ఉపాసన వెల్లడించింది.
అంతేకాదు, తమ పిల్లలకు కావాల్సివన్నీ ఇచ్చే స్థాయికి తాము ఇప్పుడు చేరామని, లేటుగా పిల్లల్ని కనడమనేది వాళ్ల పర్సనల్ నిర్ణయమని, దీని వల్ల ఎదురైన ఏ ఇబ్బందులకు తాము తలొగ్గలేదని, ఈ నిర్ణయం తమ మధ్య ఉన్న బలమైన బంధంతో పాటూ, పిల్లల విషయంలో తమకున్న స్పష్టతకు నిదర్శనమని ఉపాసన తెలిపింది.













