సీజన్3 గెస్టులు వీళ్లేనా?
ఎన్ని టాక్ షోలు వచ్చినా అందులో బాలయ్య చేసిన అన్‌స్టాపబుల్ షో మాత్రం నెక్ట్స్ లెవెల్. బాలయ్య హోస్ట్ గా ఆహా కోసం చేసిన ఈ షో కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య ఈ షో ను నడిపించిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ఇప్పుడు మూడో సీజన్‌కు రెడీ అయింది.
కాకపోతే బాలయ్య ఓ వైపు ఏపీ రాజకీయాల్లో, మరోవైపు సినిమాల్లో బిజీగా ఉండటంతో ఈ సారి సీజన్3 ను ఎక్కువ ఎపిసోడ్లుగా కాకుండా లిమిటెడ్ వెర్షన్ లో తీసుకురానున్నట్లు ఆహా ప్రకటించింది. ఇందులో భాగంగా ఓ ఎపిసోడ్‌కు భగవంత్ కేసరి టీమ్ రానుందని ఇప్పటికే సమాచారం అందుతుంది. ఇది కాకుండా మరో ఎపిసోడ్ కు మెగా స్టార్ చిరంజీవి రానున్నాడని టాక్ వినిపిస్తోంది.
కాకపోతే మెగాస్టార్ ఎపిసోడ్ తోనే ఈ సీజన్‌ను క్లోజ్ చేయనున్నట్లు చెప్తున్నారు. మిగిలిన ఎపిసోడ్లకు తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, రజినీకాంత్, రామ్ చరణ్, శివరాజ్ కుమార్, మమ్ముట్టి, రాజశేఖర్ లాంటి ప్రముఖులను తీసుకురావాలని చూస్తున్నారట. వీరిలో ఎవరు ఫ్రీ గా ఉంటే వారితో ఈ సీజన్3ను లాగిద్దామని ఆహా టీమ్ అనుకుంటున్నారట. మొదటి ఎపిసోడ్ దసరా సందర్భంగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.













