అన్‌స్టాపబుల్ సీజన్3 కు అంతా రెడీ!
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆహా ఓటీటీ వారు నిర్వహిస్తున్న ఈ షో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడో సీజన్ ను స్టార్ట్ చేయడానికి ముస్తాబవుతోంది. ఈ షో మొదటి సీజన్ కంటే రెండో సీజన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
ఇక మూడో సీజన్ ను అంతకు మించి ఉండేలా షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో ఓ ఎపిసోడ్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. చిరూ కూడా దానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఈ ఎపిసోడ్ ఎప్పుటుందనేది క్లారిటీ రావాల్సి ఉంది. దసరా నుంచి ఈ సీజన్3 ని స్టార్ట్ చేసేలా టీమ్ ప్లాన్ చేస్తుందట.
దసరా టైమ్ లో అయితే ఓపెనింగ్ ఎపిసోడ్ కు మంచి హైప్ వస్తుందని వారి నమ్మకం. మొదటి ఎపిసోడ్‌ను భగవంత్ కేసరి టీమ్ తో కానిచ్చేసి, తర్వాత వచ్చే ప్రతి ఎపిసోడ్‌కు ఓ స్పెషల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ రావడం దాదాపు ఫిక్స్. సీజన్3 లో తెలంగాణ మంత్రి కేటీఆర్, హీరో రామ్ చరణ్ ను కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.













