Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చిరాని డిసెంబర్ 4?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చిరాని తేదీ డిసెంబర్ 4 వ తేదీ అనుకుంటా! కానీ ఏప్రిల్ 28 వెరీ లక్కీ డే. ఈ రోజు విడుదలైన ‘అడవి రాముడు’, ‘పోకిరి’, ‘బాహుబలి 2’ సినిమాలు విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. ఇపుడు డిసెంబర్ 4 టాలీవుడ్ కు అన్ లక్కీ డే అని చెప్పాలి. అపుడు పుష్ప 2.. ఇపుడు అఖండ 2. అవును గతేడాది 2024 డిసెంబర్ 4న పుష్ప 2 ది రూల్ ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి చనిపోయింది. చనిపోయిన రేవతి తనయుడు శ్రీతేజ్ తొక్కిసలాటలో కోమాలోకి వెళ్లిపోయాడు. ఇప్పటికీ కోలుకోలేదు. ఓ రకంగా సంఘటనను బేస్ చేసుకొని అల్లు అర్జున్ ను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఓ రాత్రి జైల్లో ఉంచింది.
ఓ రకంగా డిసెంబర్ 4 తెలుగు సినీ ఇండస్ట్రీకి అచ్చిరాని తేదీ అని చెప్పాలి. దాదాపు యేడాది తర్వాత ‘అఖండ 2 తాండవం’ సినిమా ప్రీమియర్స్ రెండు గంటల ముందు టెక్నికల్ కారణంగా క్యాన్సిల్ అయినట్టు నిర్మాతలు ప్రకటించారు.
ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించినా చివరకు సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేసినట్టు ప్రకటించారు. ఇది కూడా డిసెంబర్ 4న జరగడం యాదృచ్ఛికం. ఓ రకంగా బాలయ్య లాంటి పెద్ద స్టేటస్ ఉన్న హీరోకు ఇలా జరగడం ఘోర అవమానం అని చెప్పాలి. ఓ పెద్ద లెగసీ ఉన్న హీరో సినిమాకు అది కూడా రాజకీయంగా పలుకుబడి ఉన్న ఎమ్మెల్యే చిత్రానికి ఇలా కావడంపై సినీ ఇండస్ట్రీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఓ రకంగా డిసెంబర్ 4 టాలీవుడ్ లో వరుసగా రెండేళ్లలో ఇలాంటి చేదు సంఘటనలు జరగడంతో ఇపుడీ డేట్ ను అన్ లక్కీ డే గా భావిస్తున్నారు సినీ వర్గాలు. ఇక 2024 లో అల్లు అర్జున్ కు అన్ లక్కీ గా మారితే.. బాలకృష్ణకు కూడా 2025 డిసెంబర్ 4న చేదు అనుభవం ఎదురైంది. అందులో ఈ రెండు సినిమాలు ఆయా హీరోలకు సీక్వెల్స్ కావడం విశేషం. మొత్తంగా చూసుకుంటే 14 రీల్స్ నిర్మాతల నిర్లక్ష్యం వల్ల బాలయ్య వంటి హీరోకు కోలుకోలేని దెబ్బ తగలింది. హిట్ అయ్యే కంటెంట్ ఉన్న సినిమాకు ఇలా జరగడం చూసి నందమూరి అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు. అంతేకాదు పెద్ద హీరోను పెట్టుకొని ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తెలుగు సినీ ఇండస్ట్రీకి డిసెంబర్ 4 అన్ లక్కీ డే తో పాటు బ్లాక్ డే గా మారిందనే చెప్పాలి. ఇక మున్ముందు డిసెంబర్ 4 తేదీనా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోరేమో?






