రివ్యూ : మలయాళ మూవీ కి మక్కి టూ మక్కి ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్: 2.75/5
బ్యానర్: ఆర్కా మీడియా వర్క్స్, మహాయాన మోషన్ పిక్చర్స్
ఓ టి టి వేదిక: నెట్ఫ్లిక్స్ ఇండియా
తారాగణం: సత్యదేవ్ కంచరాన, హరిచందన, రూప కొడువాయూర్, వికె నరేష్, సుహాస్, కె. రాఘవన్, టిఎన్ఆర్ తదితరులు
సంగీతం: బిజిబల్
ఎడిటింగ్ : రవితేజ
సినిమాటోగ్రఫీ : అప్పు ప్రభాకర్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి
దర్శకత్వం: వెంకటేష్ మహా
విడుదల తేదీ: జులై 30, 2020
ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయినా తెలుగు ఫిల్మ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని కేర్ ఆఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. సినిమా తీయడానికి భారీ తారాగణం, బలమైన కథావస్తువు, కళ్లు చెదిరే హంగుఆర్భాటాలు వుండాలని మలయాళ సినీ రచయితలు, దర్శకులు భావించరు. ఒక చిన్న సంఘటన లేదా న్యూస్ ఐటెమ్ చుట్టూ ఒక సహజమైన కథని అల్లుకుని, దానిని అత్యంత వాస్తవికంగా ప్రెజెంట్ చేస్తుంటారు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ కథ కూడా కేరళలో పుట్టినదే. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఇండియా వేదికగా నిలిచింది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…
కథ:
రివెంజ్ కథలు వెండితెరకు కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే దాదాపు యాభై శాతం సినిమాలకు ప్రతీకారమే ప్రధాన ఇతివృత్తం. ఫోటోగ్రాఫర్ అయిన మహేష్(సత్య దేవ్) తన ప్రొఫెషన్ ని ఆస్వాదిస్తూ హ్యాపీ లైఫ్ అనుభవిస్తూ ఉంటాడు. అసలు గొడవలు అంటే ఇష్టపడని మహేష్ ని గర్ల్ ఫ్రెండ్ స్వాతి (హరి చందన) అతన్ని వదిలేసి, వేరొకరిని పెళ్లి చేసుకొని దూరం అవుతుంది. ఈ క్రమంలో జోగి అనే వ్యక్తితో మహేష్ కి వివాదం ఏర్పడుతుంది. జోగి మహేష్ ని తన ఊరి ప్రజల సమక్షంలో అవమానానికి గురి చేస్తాడు. ఊరందరి ముందు తనను కొట్టి, అవమానించిన వాడికి ఉమామహేశ్వరుడి ఉగ్రరూపం చూపిస్తానని, అంతవరకు చెప్పులు ధరించనని మహేష్ శపథం చేస్తాడు. దీనితో మహేష్ జోగిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు. ఐతే ఈ లోగా తన శత్రువు జోగి చెల్లెలు జ్యోతి(రూప కొడవయూర్) ప్రేమలో పడతాడు. కాగా మహేష్ తన ప్రతీకారాన్ని, ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది మిగతా కథ…
నటి నటుల హావభావాలు:
టాలెంటెడ్ నటుడిగా మంచి పేరున్న సత్య దేవ్ ఓ టి టి హీరోగా ఇది అతని మూడవ చిత్రం. తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు అనడంలో సందేహం లేదు. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు, పతాక సన్నివేశాలలలో ఆయన నటన సహజంగా కట్టిపడేసేలా సాగుతుంది. నటుడిగా రెండు మెట్లు పైకి తీసుకెళుతుంది. యువ నటుడు సుహాస్ నటన ఈచిత్రానికి మరో ఆకర్షణ అని చెప్పాలి. టైమింగ్ కామెడీతో ఆయన పాత్ర మంచి ఆహ్లాదం పంచుతుంది. ఇక హీరోయిన్ రూప ఆకట్టుకున్నారు. సీనియర్ నటుడు నరేష్ పాత్ర కూడా మూవీలో చెప్పుకోదగ్గ ఒక అంశం.
సాంకేతిక వర్గం పనితీరు:
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది కథ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ కావడం దానికి తగట్టు మరియు అరకు అందాలు తెరపై ఆహ్లాదం పరిచాయి . మ్యూజిక్ పరవాలేదు, రీ రికార్డింగ్ చాలా బాగుంది. డైలాగ్స్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. స్క్రీన్ ప్లే కొంచెం ఆకట్టుకొనేలా రాసుకోవాల్సింది. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాతో ఒక్కసారిగా మంచి ఫేమస్ అయిన వెంకటేష్ మహా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఇది రీమేక్ చిత్రం కావడంతో ఈ సినిమాలో ఆయనకి జస్ట్ పాస్ మార్క్స్ పడతాయి. కానీ అతను చేసిన మార్పుచేర్పులు అతి స్వల్పమనే చెప్పాలి. ఆకట్టుకొనే పాత్రలు, రొమాన్స్, కామెడీ మరియు ఎమోషన్స్ తో అద్భుతంగా ఫస్ట్ హాఫ్ నడిపిన మహా సెకండ్ హాఫ్ లో కాస్త నిరాశపరిచారు.
విశ్లేషణ:
సహజంగా అనిపించే పాత్రలు, నేపథ్యం, మంచి కామెడీ మరియు రొమాన్స్ తో పాటు సంఘర్షణతో నడిచిన మొదటి సగం అలరిస్తుంది. ఐతే సెకండ్ హాఫ్ లో దర్శకుడికి చెప్పడానికి ఆసక్తికర అంశాలేవీ లేకుండా పోయాయి. దీనితో ఇంటర్వెల్ తర్వాత మూవీ నెమ్మదించింది. ఆహ్లాదభరితంగా వుండే ఈ సినిమా మధ్యలోకి వచ్చేసరికి మందగిస్తుంది. కొన్ని విషయాలలో ఈ ఉమా మహేశ్వరుడు ఉగ్రరూపం కొంచెం విసుగు కలిగిస్తుంది కానీ తెలుగు సినిమా రొటీన్ కథానాయకుల నటన మధ్య కొంచం ఫ్రెష్ గా అనిపిస్తుంది. రొమాన్స్ పేరిట అవసరానికి మించిన సీన్లతో దర్శకుడు నిడివి పెంచేశాడు. అది కూడా ఈ మూవీలో చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఇంట్లోనే మగ్గి పోతున్న మనం సినిమా చూస్తున్నంత సేపు రిలాక్స్ కోసం బయటకు వెళ్ళామా అనిపిస్తుంది గ్రామీణ వాతావరణం. ఒకవేళ మాతృక మలయాళ సినిమా చూడకుండా ఈ సినిమానే ఒరిజినల్ అనుకుని చూస్తే సంతృఫికరంగా ఉంటుంది.













