ఎన్టీఆర్ కోసం విలన్లుగా ఆ ఇద్దరు?
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను పూర్తి చేస్తున్న ఎన్టీఆర్, బాలీవుడ్ లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్2లో కూడా నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ తో పాటూ తారక్ కూడా ఈ సినిమాలో ఎంతో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా ఆగస్ట్ నుంచి షూటింగ్ మొదలుపెట్టుకోనున్నట్లు మేకర్స్ ఇప్పటికే చెప్పారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ కు సంబంధించి నెట్టింట ఆసక్తికర సమాచారం వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ఏకంగా ఇద్దరు విలన్స్ ను రంగంలోకి దించనున్నాడట. ఆ పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, టైగర్ ష్రాఫ్ ను సంప్రదించినట్లు టాక్. ఇప్పటికే బాబీ డియోల్ కన్ఫర్మ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్న టైగర్ ష్రాఫ్ తో నీల్ డిస్కషన్స్ జరుపుతున్నాడట. అయితే హీరోగా చేస్తున్న టైగర్ ష్రాఫ్, ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకుంటాడా లేదా అన్నది ప్రశ్నగా మారింది. ఒకవేళ వాళ్లిద్దరూ కన్ఫర్మ్ చేస్తే మాత్రం ఈ ప్రాజెక్ట్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లడం ఖాయం.













