Sobhitha-Lavanya: ఆ వార్తల్లో నిజమెంత?
ఇండస్ట్రీలో హీరోయిన్ల మీద ఎప్పుడూ ఏదొక వార్తలు రావడం సహజం. పెళ్లికి ముందైతే ఫలానా హీరోతో ప్రేమలో ఉందని, అతన్నే పెళ్లి చేసుకోబోతుందని వస్తే పెళ్లి తర్వాత మాత్రం ఫలానా హీరోయిన్ తల్లి కాబోతుందంటూ వార్తలు వినిపిస్తాయి. ఇలాంటి వార్తలు ఒకప్పుడు బాలీవుడ్ లోనే ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఈ వార్తలొస్తున్నాయి.
టాలీవుడ్ భామలు శోభితా ధూళిపాల(Sobhitha Dhulipala), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ప్రెగ్నెంట్స్ అని నెట్టింట తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఆరేళ్ల పాటూ ప్రేమించుకుని, ఆ తర్వాత 2023లో పెళ్లి చేసుకుని ఒకటైన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్(Varun Tej) త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనున్నరంటూ వార్తలొస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ లావణ్య రీసెంట్ గా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంది. దీంతో లావణ్య ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసేసి మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
గత డిసెంబర్ లో అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya)ను పెళ్లి చేసుకున్న శోభితా ధూళిపాల కూడా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, త్వరలోనే అక్కినేని వారసులు రాబోతున్నారంటూ ఫ్యాన్స్ సంబరపడుతన్నారు. పెళ్లి తర్వాత శోభిత కెరీర్ లో స్పీడు తగ్గించడంతోనే ఈ అనుమానాలొస్తున్నాయి. దానికి తోడు రీసెంట్ గా జరిగిన వేవ్స్2025(WAVES2025) సమ్మిట్ కు శోభిత ఎప్పటిలా కాకుండా కాస్త భిన్నంగా చీరలో కనిపించడంతో శోభిత గర్భం దాల్చిందంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.






