రెండ్రోజుల్లో దేవర పరిస్థితి మొత్తం తారుమారు
ఎట్టి పరిస్థితుల్లో దేవర సినిమాను చెప్పిన ప్రకారం ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని నిర్మాతలు క్లారిటీ ఇచ్చిన అతి తక్కువ టైమ్ లోనే ఈ సినిమాకు సంబంధించిన సీన్ మొత్తం మారిపోయింది. రీసెంట్ గా దేవర సినిమా షూటింగ్ కోసమని హైదరాబాద్కు వచ్చిన సైఫ్ అలీఖాన్ కు షూటింగ్ లో చిన్న ప్రమాదం జరగడం, తర్వాత సర్జరీ చేయడం జరిగాయి.
ఈ సర్జరీ నుంచి ఆయన కోలుకోవడానికి ఎంత టైమ్ పడుతుందనేది ఇంకా తెలియదు. మరో వైపు అనిరుధ్ ఇంకా ఈ సినిమాకు మొత్తం సాంగ్స్ రెడీ చేయలేదు. మరో 70 రోజుల్లో దేవర రిలీజ్ ఉంది. దీంతో టీమ్ మీద చాలా ఒత్తిడి ఉంది. ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలని ఆడియో కంపెనీ నుంచి ప్రెజర్ బాగా ఉందట. కానీ అసలు అనిరుధ్ దేవర కోసం ఎన్ని ట్యూన్స్ ను రెడీ చేశాడన్నది ఇప్పటివరకు తెలియదు.
ఇంకా సాంగ్స్ కు సంబంధించిన షూటింగ్ పెండింగ్ ఉంది. ఇంత టైట్ షెడ్యూల్ లో మ్యూజిక్ కోసం కొరటాల శివ, అనిరుధ్ కోసం చెన్నై కు అస్తమానం తిరగలేడు. అనిరుధ్ హైదరాబాద్ వచ్చి వర్క్ చేస్తేనే దేవర అనుకున్న టైమ్ కు రిలీజ్ కాగలదు. రీరికార్డింగ్ కోసం కూడా అనిరుధ్ ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది. ఇన్ని తతంగాల మధ్య దేవర చెప్పిన టైమ్ కు రిలీజ్ అవుతుందా లేదా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుమాన పడుతున్నారు.













