‘టూ కంట్రీస్’ ఫస్ట్ లుక్ విడుదల
మలయాళంలో విజయం సాధించిన ‘టూ కంట్రీస్’ చిత్రం.. తెలుగులో అదే పేరుతో రీమేక్ అవుతోంది. ఈ సినిమాకి ‘ఎ స్టోరీ ఆఫ్ ఫన్ అండ్ లవ్’ అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం ఎన్ శంకర్ దర్శకత్వంలో టూ కంట్రీస్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు సునీల్. ఈ చిత్రంలో మనీశా రాజ్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు . క్లాసీగా ఉన్న పోస్టర్ ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది. 2015లో మలయాళంలో వచ్చిన టూ కంట్రీస్‌కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తుండగా, ఇది సినిమాకి చాలా ప్లస్ అవుతుందని టీం భావిస్తుంది. మహాలక్ష్మీ ఆర్ట్స్ బేనర్‌పై ఎన్ శంకరే ఈ చిత్రాన్ని నిర్మించనుండడం విశేషం.













