కంగువ ట్రైలర్ లో ఆ పాత్ర ఎవరిది?
ఈ ఇయర్ భారీ అంచనాలతో రానున్న పాన్ ఇండియా సినిమాల్లో కంగువ కూడా ఒకటి. తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ముందు మాస్ సినిమా అనుకున్నారు కానీ టీజర్ తో ఇది బాహుబలి లాంటి భారీ అటెంప్ట్ అని అర్థమైంది. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా, రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ లో విజువల్స్ చూస్తుంటే ఇది మరో విజువల్ వండర్ అవడం ఖాయమనిపిస్తోంది. ఆడియన్స్ ను ఈ సినిమా ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లి ఒక వైల్డ్ రైడ్ చేయించబోతున్నట్లుంది. ట్రైలర్ లో ప్రతీ అంశం బాగున్నప్పటికీ చివర్లో వచ్చిన ఒక షాట్ మాత్రం చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. హీరో సూర్యను ఢీ కొట్టడానికి గుర్రం మీద ఓ యోధుడున్నట్లు ఆ పాత్రను రివీల్ చేయకుండా ఓ గ్లింప్స్ లా చూపించాడు డైరెక్టర్ శివ.
కంగువలో కార్తి కూడా ఓ పాత్రలో కనిపించనున్నాడని ఇప్పటికే వార్తలొచ్చిన నేపథ్యంలో ట్రైలర్ చివరలో వచ్చిన ఆ పాత్ర కార్తిదే అని అందరూ భావిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో తొలి భాగంలో బాబీ డియోల్ అంతమొందాక హీరోకు సవాల్ విసరడానికి ఈ పాత్ర ఎంట్రీ ఇస్తుందని, సినిమా చివర్లో సెకండ్ పార్ట్ కు లీడ్ ఇస్తూ ఆ క్యారెక్టర్ ను పరిచయం చేస్తారని అందరూ అనుకుంటున్నారు.













