ఆ ఇద్దరికీ మంగళవారం ఎంతో కీలకం
ఆరెక్స్100తో సెన్సేషనల్ హిట్ అందుకుని, అందరి మనసుల్ని గెలుచుకున్న పాయల్ రాజ్‌పూత్‌కు ఆ తర్వాత అనుకున్నంత సక్సెస్ రాలేదు. అందులో పాయల్ నెగిటివ్ రోల్ చేయడంతో తర్వాత పెద్దగా ఛాన్సులు వచ్చింది లేదు. ఒకటి రెండు అవకాశాలొచ్చినా అవి పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత అసలు పూర్తిగా కెరీర్ డల్ అయిపోయింది. మధ్యలో నాలుగైదు సినిమాలు చేసినా అవి అసలు జనానికి గుర్తు కూడా లేదు.
దీంతో ఇప్పుడు మళ్లీ తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్‌తోనే మళ్లీ జోడీ కడుతుంది. మంగళవారం టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ ప్రీ లుక్‌ని రీసెంట్గా రిలీజ్ చేశారు. ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది కాన్సెప్ట్ కూడా. ఇన్ సైడ్ టాక్ ప్రకారం, ఈ సినిమాలో పాయల్ రోల్‌కు చాలా షేడ్స్ ఉంటాయట. ఎవరూ ఊహించని ట్విస్ట్ తో ప్రతి మంగళవారం జరిగే అనూహ్య సంఘటనలకు తన క్యారెక్టర్‌కు ఏదో గట్టి లింక్‌తో ఆడియన్స్‌కు షాక్ ఇచ్చేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సక్సెస్ అవడం అజయ్ భూపతికి కూడా ఎంతో కీలకం. రెండో సినిమా మహా సముద్రంతో డిజాస్టర్ అందుకున్నాడు. శర్వానంద్, సిద్దార్థ్ లాంటి పెద్ద నటులున్నా సినిమా కథ మీద బాగా నెగిటివిటీ వచ్చింది. దీంతో ఒక్కసారిగా స్టార్ హీరోల నుంచి అజయ్ కు పిలుపులు రావడం మానేశాయి. కాబట్టి ఈ మంగళవారం సినిమా అజయ్ భూపతి, పాయల్ కు ఎంతో కీలకం కానుంది. ఈ సినిమాలో షాలిని పాండే మరో హీరోయిన్గా నటిస్తుంది.













