నిన్ను కోరి, మజిలీని మించేలా టక్ జగదీష్ ఎమోషన్స్
నేచురల్ స్టార్ నాని తాజాగా నటించిన టక్ జగదీష్ రిలీజ్ కు రెడీ అవుతుంది. డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచి కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే సినిమా పాటలు టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఉగాది కానుకగా ఏప్రిల్ 23న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆడియన్స్ కూడా సినిమా గురించి చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు టక్ జగదీష్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా డైరక్టర్ శివ నిర్వాణ ఎప్పుడూ తెరకెక్కించేలానే చాలా ఎమోషనల్ టచ్ తో రూపొందిందట. సినిమా లుక్స్ చూస్తే చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఫోకస్ పెట్టినట్లుగా అనిపిస్తుంది. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే.. ఈ సినిమా నిన్ను కోరి, మజిలీ సినిమాలను మించి ఎమోషనల్ గా ఉండనుందని సమాచారం.
కాకపోతే కేవలం కమర్షియల్ గా మాత్రమే కాకుండా ఎమోషన్స్ కూడా ఉండేట్లు కవర్ చేశాడట శివ. సెకండాఫ్ లో నాని, జగపతి బాబుల మధ్య వచ్చే సీన్స్ కు ప్రేక్షకులు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారని చిత్ర యూనిట్ చెప్తుంది. మరి ఈసారి ఎలాంటి ఎమోషన్స్ తో శివ నిర్వాణ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాడో..? అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. షైన్ స్క్రీన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతమందిస్తుండగా, నాని సరసన రితూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ లు నటిస్తున్నారు.













