శంకర్ పై విపరీతమైన ట్రోలింగ్
డైరెక్టర్ శంకర్ అంటే సినీ పరిశ్రమకు చెందిన అందరికీ ఎంతో గౌరవం. జెంటిల్మెన్ సినిమాతో మొదలుపెట్టి రోబో వరకు ఆయన క్రియేట్ చేసిన విజువల్ వండర్స్ అలాంటి ఇలాంటివి కావు. ఆ సినిమాలు ఎంతో మందికి ఆదర్శం. అంతెందుకు డిజాస్టర్లయిన ఐ, 2.0 సినిమాల్లో సైతం ఆయన క్రియేటివ్ బ్రిలియన్స్ కనిపిస్తూ ఉంటుంది.
కానీ ఇప్పుడు కథ మారింది. ఇండియన్2 రిలీజయ్యాక శంకర్ మీద కామెంట్స్ ఎక్కువయ్యాయి. ఇండియన్2 ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి శంకర్ మీద సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. మరీ ముఖ్యంగా కమల్ పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు, రకుల్ ప్రీత్ క్యారెక్టర్, బాబీ సింహా కామెడీ ఇలా ప్రతీ విషయంలో ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
దీన్ని బట్టి శంకర్ ఇండియన్2 సినిమాతో ఎంత దారుణమైన అవుట్పుట్ ను ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా చూశాక ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ పై అనుమానపడుతున్నారు. రామ్ చరణ్ ను గేమ్ ఛేంజర్ లో ఎలా చూపించాడా అని సందేహపడుతున్నారు. మరి శంకర్ గేమ్ ఛేంజర్ మీద ఫోకస్ వల్ల ఇండియన్2 పై ఫోకస్ చేయలేకపోయాడా లేదా ఇండియన్2 విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే శంకర్ ఈ ట్రోలింగ్ బారిన పడ్డాడా అనేది తెలియాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే. గేమ్ ఛేంజర్ హిట్ అయితే శంకర్ మీద పడిన ఈ మచ్చ పూర్తిగా తొలగిపోతుంది.













