గోపీ సుందర్ పై ఓ రేంజ్ లో ట్రోల్స్
టాలీవుడ్ లో ఎంతో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ను సంపాదించుకున్న మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ఇప్పుడు ట్రోలింగ్ కు గురవుతున్నాడు. నిన్ను కోరి, మజిలీ, గీత గోవిందం లాంటి సినిమాలకు గొప్ప మ్యూజిక్, నేపథ్య సంగీతం అందించిన గోపీ సుందర్, రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ విషయంలో మాత్రం ఎన్నడూ లేనంతగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఈ సినిమా సాంగ్స్ విషయంలో మొదలైన నెగిటివిటీ, సినిమాలో నేపథ్య సంగీతం విన్నాక ఇంకా పెరిగిపోయింది. ఫ్యామిలీ స్టార్ లో కళ్యాణి వచ్చా వచ్చా సాంగ్ ఒక్కడు సినిమాలోని అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా సాంగ్ ను పోలి ఉండగా, మధురము కదా సాంగ్ దిల్ సే సినిమాలోని జియా చలే సాంగ్ కు కాపీగా అనిపిస్తుంది.
ఇక సినిమా చూశాక అందరూ బ్యాక్ గ్రౌండ్ విషయంలో కూడా గోపీని తిట్టిపోస్తున్నారు. సీన్స్ తో సంబంధం లేకుండా నాన్ సింక్ లో ఇచ్చిన బీజీఎం ఆడియన్స్ కు పిచ్చెక్కిస్తుంది. రవిబాబుతో ఫైట్ సీన్ లో సంస్కృత శ్లోకాలతో వచ్చే బీజీఎం మరీ టూ మచ్ గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా ఎక్కడా బీజీఎం సింక్ లో లేదు. దీంతో అసలు గోపీకి ఏమైందని ఆయన ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.













