వైరల్ అవుతున్న త్రివిక్రమ్ పాత వీడియో
తన మాటలతో ప్రేక్షకుల్ని ఆలోచింపచేసే త్రివిక్రమ్‌కు మాటల మాంత్రికుడు అనే బిరుదు ఊరికే రాలేదు. ఆయన నుంచి వచ్చే మాటలు ఎంతో గాంభీర్యంగా, చిలిపిదనంతో కూడుకుని ఉంటాయి. అంతే కాదు ఆయన చెప్పే మాటలు మనల్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే త్రివిక్రమ్ డైరెక్టర్ కాకముందు ఎన్నో సినిమాలకు రచయితగా పని చేసిన సంగతి తెలిసిందే.
ఆయన స్టోరీ అందించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్లే. చిన్న చిన్న సీన్స్, మాటలతోనే సంభాషణలను ఎలివేట్ చేయడంలో త్రివిక్రమ్ దిట్ట. అందుకే ఆయన సినిమాల్లోని మాటలైనా, ఆయన స్టేజ్ పైన ఇచ్చే స్పీచులైనా ఎప్పుడూ నెట్టింట ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా త్రివిక్రమ్ కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో త్రివిక్రమ్, అమీర్ ఖాన్ నటించిన రంగ్ దే బసంతి మూవీ స్క్రీన్ ప్లే గురించి మిగిలిన వారికి బోర్డుపై వివరిస్తూ ఉన్నాడు. రూమ్ లో చాలా మంది కూర్చుని ఉండగా, త్రివిక్రమ్ వారికి ఈ మూవీ గురించి, అందులో ఉన్న సీన్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దాదాపు 9 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.













