బన్నీ కంటే ముందు చిరూతో?
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమా చేస్తున్న త్రివిక్రమ్ దాన్ని ఎలాగైనా సంక్రాంతి రేసులో నిలపాలని టార్గెట్ పెట్టుకుని మరీ షూటింగ్‌ను పూర్తి చేస్తున్నాడు. నవంబర్ లోపు ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ ను పూర్తి చేసి, డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయాలని త్రివిక్రమ్ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు.
గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్, ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. కానీ ఇక్కడ కొన్ని కీలక పరిణామాలు జరిగాయని ఇండస్ట్రీ టాక్. బన్నీ చేస్తున్న పుష్ప2 కంప్లీట్ అవడానికి ఇంకా పట్టనుంది. సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. ఆ తర్వాత బన్నీ ఎలాగూ మరో రెండు నెలలైనా గ్యాప్ తీసుకోవడం ఖాయం.
మరోవైపు త్రివిక్రమ్ గుంటూరు కారం పూర్తి చేసుకుని ఫిబ్రవరి నుంచి ఖాళీగానే ఉంటాడు. అంటే దాదాపు త్రివిక్రమ్ కు ఆరు నెలల టైమ్ ఎంతలేదన్నా ఉంటుంది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ ఎప్పటి నుంచో అనుకుంటున్న చిరంజీవి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడట. డీవీవీ దానయ్య నిర్మాతగా ఈ కాంబో ఎప్పుడో సెట్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల లేటవుతూ వచ్చింది. ఇదంతా చర్చల దశలోనే ఉంది కానీ నిజంగా ఈ కాంబోలో సినిమా వస్తుందన్న వార్త మాత్రం టాలీవుడ్ లో గట్టిగానే ప్రచారమవుతుంది.













