21 ఏళ్ళు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినీ ప్రయాణం
స్వయంవరం చిత్రంతో మాటల రచయితగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినీ ప్రస్థానం లో 21 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు.
“ఈ ప్రయాణం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, వెనక్కు తిరిగి చూడలేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఎంతో గమ్మత్తుగా ఉంది, ఉద్వేగానికి లోనవుతున్నాను. నా ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నమస్కారాలు తెలుగుసినీ ప్రేక్షకులకు ఎప్పటికీ ఋణపడిఉంటాను.” అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
ప్రతుతం ఎన్టీర్ 30వ చిత్రానికి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా వున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.













