తన సినిమాకు త్రివిక్రమ్ టైటిల్ పెట్టుకున్న హీరో సత్యదేవ్!
ఏ సినిమాకైనా టైటిల్ చాలా ఇంపార్టెంట్. టైటిల్‌ని బట్టి అది ఏ తరహా సినిమా అనేది తెలుస్తుంది. దర్శకనిర్మాతలు సినిమాని ఎంత ఈజీగా తెరకెక్కిస్తారో.. టైటిల్ డిసైడ్ చేసుకోవడానికి అంత కష్టపడతారు. ఒక్కోసారి వారు అనుకున్న టైటిల్ మరొకరి దగ్గర ఉండడం, దాన్ని దక్కించుకోవడానికి ఎక్కువ మొత్తంలో ఆ టైటిల్ రిజిష్టర్ చేసిన వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే కొందరు దర్శకనిర్మాతలు మాత్రం ఒక అండర్‌స్టాండింగ్‌తో వారి దగ్గర ఉన్న టైటిల్‌ని అవసరం ఉన్న వారికి ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే సత్యదేవ్, తమన్నా జంటగా రూపొందే చిత్రానికి వచ్చింది. ఈ సినిమాకి గుర్తుందా శీతాకాలం అనే టైటిల్‌ని పెట్టారు.
ఈ టైటిల్ త్రివిక్రమ్ రిజిష్టర్ చేయించాడు. వాస్తవానికి ఈమధ్యకాలంలో త్రివిక్రమ్ తీసే సినిమాలన్నింటికీ `అ`తో స్టార్ట్ అయ్యే టైటిల్స్‌ని పెట్టడం చూస్తున్నాం. అత్తారింటికి దారేది, అఆ, అరవింద సమేత, అజ్ఞాతవాసి, అల వైకుంఠపురములో.. ఇలా అన్నీ `అ`తో స్టార్ట్ అయ్యే టైటిల్సే. తాజాగా అయినను పోయిరావలె హస్తినకు అనే ఓ పొలిటికల్ టైటిల్‌ని కూడా రిజిష్టర్ చేయించాడు త్రివిక్రమ్. ఇది ఎన్టీఆర్‌తో చేసే సినిమా కోసమేనని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మరి గుర్తుందా శీతాకాలం అనే టైటిల్‌ని ఎందుకు రిజిష్టర్ చేయించాడో తెలీదు. సత్యదేవ్, తమన్నాతో చేస్తున్న సినిమా కన్నడలో సూపర్‌హిట్ అయిన లవ్ మాక్టైల్కి తెలుగు రీమేక్. ఈ సినిమాకి ఏ టైటిల్ అయితే బాగుంటుందని ఆలోచించిన యూనిట్‌కి హీరో సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం టైటిల్ గురించి చెప్పాడు. ఇది త్రవిక్రమ్ దగ్గర ఉండడంతో అతన్నిరిక్వెస్ట్ చేసి ఆ టైటిల్‌ను తన సినిమాకి పెట్టకున్నాడు సత్యదేవ్.













