మోక్షు కోసం త్రివిక్రమ్?
భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలయ్య, బాబీ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి త్రివిక్రమ్ సంస్థ ఫార్ట్యూన్ ఫోర్ నిర్మిస్తోంది. ఈ సినిమా వల్ల త్రివిక్రమ్ తో బాలయ్యకు మంచి అనుబంధమే ఏర్పడింది. ఈ అనుబంధాన్ని ఆయన కొడుకు మోక్షజ్ఞ అరంగేట్రం కోసం ఉపయోగించుకోబోతున్నాడట బాలయ్య.
నందమూరి ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోక్షు వెండితెర అరంగేట్రానికి టైమ్ దగ్గర పడ్డట్టే కనిపిస్తోంది. నెక్ట్స్ ఇయర్ మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని బాలయ్య ఇప్పటికే ధృవీకరించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం బాలయ్య కథను వండిస్తున్నాడట. దీనికోసం ఎంతో మంది స్టార్ డైరెక్టర్ల సాయం తీసుకుంటున్నాడట బాలయ్య.
అందరి సలాహాలు సూచనల ఆధారంగా ఒక మంచి స్టోరీని రెడీ చేయించి, ఆ కథతో మోక్షజ్ఞను తెలుగు తెరకు పరిచయం చేయాలని చూస్తున్నాడు బాలయ్య. ఇందులో భాగంగానే బాలయ్య, త్రివిక్రమ్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మోక్షు కోసం త్రివిక్రమ్ పూర్తిగా కథ అందించకపోయినా, మంచి ఇన్పుట్స్తో కథను డెవలప్ చేయించే ఛాన్స్ అయితే ఉంది.













