రాజమౌళి డెసిషన్ తో ముడిపడ్డ త్రివిక్రమ్ సినిమా..
ఒక సినిమా అనౌన్స్ చేసింది మొదలు.. అది రిలీజ్ అయ్యే వరకు.. మధ్యలో ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అరవింద సమేత చిత్రం తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. గతేడాది సంక్రాంతికి అలవైకుంఠ పురములో రిలీజ్ అయిన తర్వాతి నుంచి ఎన్టీఆర్ సినిమా కోసమే వేచి ఉన్నాడు త్రివిక్రమ్. కానీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగియక ముందే తర్వాతి సినిమాకు కమిట్ అవడంతో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు ఎన్టీఆర్30 టీమ్. కానీ కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆగిపోవడం, సినిమా లేట్ అవడం, ఫలితం ఎన్టీఆర్30 రిలీజ్ డేట్ మూడు సార్లు మారింది. ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కూడా మారుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫినిష్ చేస్తేనే త్రివిక్రమ్ సినిమా మొదలవుతుంది. మే నుంచి రెగ్యులర్ షూట్ కు కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ గ్యాప్ లో సుమారు ఏడాదికి పైగా త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నాడు. ఈ సమయాన్ని ఏకే రీమేక్ కు మాటలు, స్క్రీన్ ప్లే రాయడానికి కేటాయించుకున్నాడు త్రివిక్రమ్.
ఇదిలా ఉంటే మళ్లీ తన కెరీర్ లో ఇలాంటి పొరపాటు మళ్లీ జరగొద్దని నిర్ణయించుకున్న త్రివిక్రమ్.. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ ప్లాన్స్ ఇప్పటికే జరుగుతున్న నేపథ్యంలో ఆ సినిమాను ఇప్పుడే అనౌన్స్ చేయాలని ప్రిన్స్ కోరుతున్న నేపథ్యంలో త్రివిక్రమ్ మాత్రం తొందరపడట్లేదు. దానికి కారణం ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళితో మహేష్ సినిమా ఉండటమే. అంటే ఎంత టైమ్ పడుతుందో చెప్పలేం. అంతే కాదు రాజమౌళి ఆర్ఆర్ఆర్ అయిపోగానే మహేష్ తో సినిమా తీస్తాడా లేదా కాస్త గ్యాప్ తీసుకుని సినిమాను సెట్స్ కు తీసుకెళ్తాడా అన్నది కూడా తెలీదు. ఈ విషయంపై క్లారిటీ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేస్తున్నాడట.ఈ క్లారిటీ ని బట్టి మహేష్ తో తన సినిమాను ప్లానే చేసే విధంగా త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట.













