రాత్రింబవళ్ళు కష్టపడుతున్న త్రివిక్రమ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. రిలీజ్ కు మరో రెండు వారాల టీమే ఉండటంతో చిత్ర యూనిట్ చాలా బిజీగా ఉంది.
ఇప్పటికీ గుంటూరు కారం షూటింగ్ ఫార్మాలిటీస్ ఫినిష్ కాలేదని తెలుస్తోంది. మార్చిలో గుంటూరు కారం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన మేకర్స్, అప్పుడే సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. గుంటూరు కారం సెట్స్ పైకి వెళ్లి దాదాపు ఏడాదిపైగా అయిది. కానీ ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.
అనుకున్న టైమ్ కు సినిమా ఫస్ట్ కాపీని రెడీ చేసి సెన్సార్ కు పంపాలనుకున్నప్పటికీ టైమ్ లేక టీమ్ మెంబర్స్ ఒత్తిడికి గురవుతున్నారని టాక్. ఈ లోపు మహేష్ న్యూ ఇయర్ కోసం తన ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ ట్రిప్‌కు వెళ్లనున్నాడట. మళ్లీ జనవరి ఫస్ట్ వీక్ లో మహేష్ ఇండియాకు రానున్నాడు. వచ్చాక కూడా గుంటూరు కారం ప్రమోషన్స్ లో మహేష్ పెద్దదగా పాల్గొనడట.
వీటన్నింటినీ చూస్తుంటే త్రివిక్రమ్ కు ఉన్న టైమ్ చాలా తక్కువ. అందుకే డిసెంబర్ 26 కల్లా మొత్తం వర్క్ ను ఫినిష్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పెండింగ్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఎలా అయినా సినిమాను చెప్పిన తేదీకి రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ గుంటూరు కారం కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడు. మరి ఆయన కష్టానికి తగ్గ రిజల్ట్ ను గుంటూరు కారం అందిస్తుందో లేదో చూడాలి.













