లక్కీ భాస్కర్ వెనుక త్రివిక్రమ్?
తొలిప్రేమ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన వెంకీ అట్లూరి, మొదటి సినిమాతోనే తన మార్క్ చూపించాడు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు అనుకున్న రిజల్ట్ ను ఇవ్వకపోయినప్పటికీ అవేమీ తన కెరీర్‌పై పడకుండా చాలా జాగ్రత్తగా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాడు వెంకీ. ధనుష్ తో సార్ సినిమాను తీసి మంచి హిట్ కొట్టాడు.
ఈ సినిమా రిలీజ్ కు ముందే త్రివిక్రమ్ సినిమా సక్సెస్ అవుతుందని స్టాంప్ వేశాడు. వెంకీ రైటింగ్ శైలి గురించి కూడా త్రివిక్రమ్ ప్రశంసించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ కొనసాగుతుంది. తాజాగా వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
సాధారణ మనిషి ఉన్నతమైన స్థాయికి ఎలా ఎదిగాడనేది ఈ సినిమా కథ. ఇదే స్టోరీతో చాలా సినిమాలు వచ్చినప్పటికీ వెంకీ ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా స్టోరీ విషయంలో కూడా త్రివిక్రమ్ ఉన్నారని తెలుస్తోంది. హీరోయిన్ మీనాక్షిని సెలెక్ట్ చేయడం వెనుక రీజన్ కూడా గురూజీనే అని టాక్. మొత్తానికి వెంకీకి మరోసారి రిలీజ్ కు ముందే గురూజీ స్టాంప్ పడిందంటే అది సినిమాకు కలిసొచ్చే అంశమే.













